ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు తెలిపారు. వివరాల్లో వెళితే దొండపూడి గ్రామానికి చెందిన కొమ్మిరెడ్డి బలరామకృష్ణ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకట్రాజు ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు తక్షణమే మంజూరు చేయించి, దానికి సంబంధించిన పత్రాలను కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.