గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శనివారం పలు గ్రామాలలో పర్యటించనున్నట్లు క్యాంపు కార్యాలయ వర్గ ప్రతినిధులు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు ఎర్నగూడెంలో పర్యటిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు దేవరపల్లిలో డెంటల్ హాస్పిటల్ ప్రారంభం, సాయంత్రం నాలుగు గంటలకు దుద్దుకూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని అన్నారు.