లక్ష్మీ మంగను విధుల్లోకి తీసుకుంటాం: ఎమ్మెల్యే బాలరాజు

పోలవరం నియోజకవర్గం టీ నర్సాపురంలో ఆశ వర్కర్ ను విధుల్లోకి తీసుకోవాలంటూ జరుగుతున్న ఆందోళనకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురువారం సంఘీభావం తెలిపారు. ఆశ వర్కర్ లక్ష్మీ మంగను అసత్య కారణాలతో విధులనుండి బహిష్కరించారని ఎమ్మెల్యే బాలరాజుకు ఆందోళనకారులు తెలియజేశారు. స్పందించిన ఎమ్మెల్యే ఎం. ఎల్. హెచ్. పి నాగబాబుపై విచారణ చేపట్టి, అవసరమైన చర్యలు తీసుకుంటామని, లక్ష్మీ మంగను విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు

தொடர்புடைய செய்தி