ప. గో: రెవెన్యూ అధికారి ఉదయభాస్కరరావు బదిలీ

పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న జె. ఉదయభాస్కరరావును బదిలీపై నెల్లూరు జిల్లా డీఆర్ఓగా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. జె. ఉదయ భాస్కరరావు స్థానంలో ఎం. వెంకటేశ్వర్లను పశ్చిమగోదావరి జిల్లా డీఆర్ఓగా నియమిస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. వెంకటేశ్వర్లు త్వరలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

தொடர்புடைய செய்தி