ఏలూరు పార్లమెంటు పరిధిలో తన పేరు చెప్పి ఎవరైనా అక్రమ వసూళ్లు, దందాలు పాల్పడితే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చునని ఏలూరు ఎంపీ పుట్ట మహేశ్ అన్నారు. బుట్టాయిగూడెం ఏకలవ్య మోడల్ స్కూల్ పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలో ఇల్లీగల్ ఆక్టివిటీస్ జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎవరైనా తన పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే కలెక్టర్, ఎస్పీ లేదా నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు.