నరసాపురం: కళాశాల సమీపంలో నూతన మద్యం షాపును ఏర్పాటు చేయవద్దు

నరసాపురం శ్రీ సూర్య జూనియర్‌, డిగ్రీ కళాశాల విద్యార్థులంతా కలిసి బుధవారం నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఆర్డీవో దాసిరాజు, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ ను కలిశారు. 1వవార్డ్‌ శ్రీహరి పేట సమీపంలో తమ కళాశాల సమీపంలో నూతన మద్యం షాపును ఏర్పాటు చేయవద్దని వినతి పత్రాన్ని అందించారు. మద్యం షాప్‌ ఏర్పాటు చేయడం వల్ల మందుబాబుల ఆగడాలు ఎక్కువ అవుతాయని ఆవేదన చెందారు. తమ కళాశాలకు దూరంగా పెట్టుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி