ఓటర్ల సంక్షిప్త సవరణ-2025పై ప. గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం భీమవరం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలోని ఈఆర్వోలు, ఏఈఆర్ఓలతో సమావేశమై ఓటర్ల జాబితా సవరణపై సమీక్షించారు. తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించే లక్ష్యంతో పగడ్బందీగా ఓటర్ల స్క్రూటీని చేయాలన్నారు. ఈఆర్వోలు. బీఎల్ఓలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఓటర్ల జాబితా తయారీలో దిశానిర్దేశం చేయాలన్నారు.