విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమం తరగతులు

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల రావులపాలెం నందు విద్యార్థి ప్రేరణ కార్యక్రమం ప్రిన్సిపాల్ డాక్టర్ సి కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. డిగ్రీ మొదటి సంవత్సర విద్యార్థులకు 21 రోజులు విద్యార్థి ప్రేరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ , క్లీన్ అండ్ గ్రీన్ కోసం ఫిజికల్ డైరెక్టర్ యువరాజు మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మనకి చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ప్రతిరోజు వ్యాయామం అనేది తప్పనిసరిగా చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని విద్యార్ధులకి వివరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సత్యమూర్తి , అకడమిక్ కోఆర్డినేటర్ కే రజనీ, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி