అనపర్తి ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో రైజింగ్ హాండ్స్ ఫర్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భోజనశాలను అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించడం జరిగింది. అనంతరం గర్భిణీ స్త్రీలు, రోగులు వారి సహాయకులకు 70 మందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా భోజనాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు కర్రీ బాల వెంకట సత్యనారాయణ రెడ్డి మరియు సంస్థ ప్రతినిధులు నల్లమిల్లి ఆదిరెడ్డి, తాడి చంద్రశేఖర్ రెడ్డి , చేవలి శ్రీనివాస్ , నల్లమిల్లి వినురెడ్డి, చింతా రాఘవ , కొవ్వూరి దేవారెడ్డి, నల్లమిల్లి శివ రామారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.