సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి పేర్కొన్నారు. కాకినాడలో సూర్య కళా మందిరంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనుమాడి కొండబాబు ప్రారంభించారు.