నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని మంగళవారం గోపాలపురం మండలం వాదాలకుంట స్థానిక ఎంపీపీ పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ జొన్నకూటి మనమ్మ పాల్గొన్నారు. నులిపురుగులు ఉంటే పిల్లల్లో పోషకాహర లోపం, రక్తహీనత ఉంటుందని, ఆల్బెండజోల్ మాత్రలను వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎమ్స్, ఆశ వర్కర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.