సీజనల్ వ్యాధులపై జాగ్రత్త వహించండి

వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు పెదకూరపాడు మండలంలో అధికంగా ప్రబలుతున్నాయని, ప్రజలు జాగ్రత్తలు వహించాలని డాక్టర్ వలిగొండ రెడ్డి కోరారు. కాచి చల్లార్చిన నీరును సేవించడం ద్వారా ఎలాంటి రోగాలు దరి చేరవని ప్రజలకు సూచించారు. వర్షాకాలంలో అధికంగా తడవడం నెమ్ము సంతరించుకోవడం ఎంతో ప్రమాదకరమని అన్నారు. దోమల వ్యాప్తి ద్వారా అనేక రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని జాగ్రత్తలు వహించాలని కోరారు.

தொடர்புடைய செய்தி