ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 2019 వ సంవత్సరం నుండి 2024 వరకు.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మంజురైన గృహాలు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులను ఎంపీడీవో సి. గంగయ్య ఆదేశించారు. కలికిరి పంచాయతీ కార్యాలయంలో శనివారం ఈఓ గురుమోహన్, సర్పంచ్ ఎల్లయ్య, రెడ్డివారి యోగేష్ రెడ్డి అధ్యక్షతన మన ఇల్లు, మన గౌరవం కార్యక్రమం నిర్వహించారు. 2025 మార్చి లోపు గృహ నిర్మాణాలు పూర్తి చేయని లబ్ధిదారుల ఇంటి పట్టాలు రద్దు చేయనున్నట్లు తెలిపారు.