కొత్తురు శారదా నది గట్టును పరిశీలించిన ఎమ్మెల్యే

అనకాపల్లి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరద ముప్పు పొంచి ఉండడంతో రాంబిల్లి మండలంలోని కొత్తూరు గ్రామంలో శారదా నది గట్టును ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తొందరలోనే శారదా నది గట్టుకు అవసరమయ్యే నిధులు సమకూర్చుతామని తెలియచేశారు.

தொடர்புடைய செய்தி