వరద బాధితులకు విద్యార్థుల సాయం

విజయవాడ వరద బాధితుల సహాయార్థం కేజే పురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, పాఠశాల విద్యా కమిటీ సహకారంతో.. 10,902 రూపాయలు బుధవారం ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వి. దాసు, విద్యా కమిటీ చైర్మన్ సంతోష్ కుమార్, ఏపీపీఎస్ నాయకులు జగన్మోహన్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி