మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాంబిల్లి మండలం మూలజంపలో రాంబిల్లి ఎపిఓ నాని బాబు ఆధ్వర్యంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2024- 25 సంవత్సరానికి గాను కొత్త పనులను గుర్తించడం, వంద రోజులు పూర్తికాని వారికి పని కల్పించడం, జాబ్ కార్డు లేని వారి వివరాలు సేకరించడం వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేగి అచ్చయ్య నాయుడు, మాజీ సర్పంచ్ వేగి రాము పాల్గొన్నారు.