విశాఖ: చలో కలెక్టరేట్ ను అడ్డుకున్న పోలీసులు

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పోలీసులు సోమవారం అడ్డుకున్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాధర్నా నిర్వహించిన కార్మికులు చలో కలెక్టరేట్ కు బయలుదేరుతుండగా వారిని అరెస్టు చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి అయోమయంగా ఉందన్నారు. వీరి సమస్యలను తక్షణం పరిష్కరించాలన్నారు.

தொடர்புடைய செய்தி