విశాఖ వాల్తేరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ గురువారం, శుక్రవారాల్లో విజయనగరం రాయగడ రూట్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ప్రయాణికుల సౌకర్యాలు కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇంజనీరింగ్, ఆపరేషన్, మెకానికల్ తదితర విభాగాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.