ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రేషన్ డిపోల ద్వారా నిత్యావసరాలు సరఫరా చేయాలని ఏపి మహిళా సమాఖ్య అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి బూసి పరమేశ్వరి డిమాండ్ చేశారు. ఆదివారం గాజువాక సమీపంలోని స్టీల్ ప్లాంట్ రైతు బజార్లో మహిళలు నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా పరమేశ్వరి మాట్లాడుతూ ధరలు నియంత్రించాలని డిమాండ్ చేసారు.