విశాఖ: విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ

విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన పోస్టర్ ని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తక ప్రదర్శన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పుస్తక పఠనం నేటి సమాజంకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. సాంకేతికత ఎంత పెరిగినా పుస్తకానికి ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ పీఏ రాజు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி