ముంచంగిపుట్టు మండలంలోని దారేల పంచాయతీ పరిధి పేటమాలిపుట్ లో ఉన్న ఎంపీపీ పాఠశాల వద్ద గురువారం బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాండురంగస్వామి పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. నెహ్రూకి పిల్లలు అంటే అమితమైన ప్రేమని, అందుకని ఆయన పుట్టిన రోజున జాతీయ బాలల దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు.