గణేష్ ఉత్సవాలు.. నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు
గణేష్ నిమజ్జన ఉత్సవాలు సజావుగా జరిగేలా చూడాలని ఎస్పీ నారాయణ రెడ్డి సూచించారు. మంగళవారం తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ స్వప్న పరిమళ్, హిందూ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షించారు. యాలాల మండలం కోకట్ వాగు వద్ద చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.