వికారాబాద్: లగచర్ల ఘటన.. 2 వారాల్లో రిపోర్టు ఇవ్వండి
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనను కేంద్ర మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి ఆదేశించింది. కాగా గత రెండు రోజుల క్రితం ఫార్మా సిటీకి భూములు ఇవ్వనందుకు పోలీసులు తమను హింసించారని, అక్రమంగా నిర్బంధించారని కొందరు గ్రామస్థులు, బీఆర్ఎస్ నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు.