
మేడ్చల్: ఇవాళ భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని ములుగు, వరంగల్, మహబూబాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. నిన్న తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.