నల్గొండ: ధరణి పైలెట్ ప్రాజెక్టు ప్రక్రియను వారంలో పూర్తి చేయాలి
నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలో చేపట్టిన ధరణి పైలెట్ ప్రాజెక్టు ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం ఆమె తిరుమలగిరి సాగర్ తహసిల్దార్ కార్యాలయంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్రమణ్యం తదితర అధికారులతో కలిసి పైలట్ ప్రాజెక్టు పై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు కింద మండలంలోని 14 గ్రామాలలో సర్వే నిర్వహించడం జరుగుతున్నది.