రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమైందని బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. గావ్ చలో, బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలం పేరువంచలో ఆదివారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేరువంచలోని జెడ్సీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి అయిన పొంగులేటి పాఠశాలలో మంచినీటి సౌకర్యం కల్పించడం కోసం రూ. 1, 10, 016లు విరాళంగా అందించారు.