తిమ్మాపూర్: రైతులకు, ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం విజ్ఞప్తి
తిమ్మాపూర్ మండలం రేణికుంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోళ్లు చేస్తున్న తీరును పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులున్న సంబంధిత అధికారులు, కాంగ్రెస్ నేతలకు తెలపాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో లోపాలపై ఎలాంటి భేషజాలు లేకుండా ప్రతిపక్షాల ఫిర్యాదులు స్వీకరిస్తామని మంత్రి అన్నారు.