బంజారాల ఆరాధ్యదైవం, సంఘ సంస్కర్త, జాతి ఉన్నతికి కృషి చేసిన ఆధ్యాత్మిక మార్గదర్శి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సేవాలాల్ మహారాజ్ అని అభివర్ణించారు. సాత్ భవాని అమ్మవార్ల కరుణాకటాక్షాలు అందరిపైనా ఉండాలని సీఎం రేవంత్ ఆకాంక్షిస్తూ బంజారా సోదర, సోదరీమణులకు శుభాభినందనలు తెలియజేశారు.