వాంకిడిలో 7గురు పేకాట రాయుళ్ల అరెస్ట్

69பார்த்தது
వాంకిడిలో 7గురు పేకాట రాయుళ్ల అరెస్ట్
వాంకిడి మండలం ఖమాన గ్రామ శివారులోని పేకాట శిబిరంపై పోలీసులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. వాంకిడి సీఐ సత్యనారాయణకు వచ్చిన పక్కా సమాచారం మేరకు పోలీస్ సిబ్బందితో కలిసి గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు. దాడుల్లో 7 గురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 8, 280 నగదు, 3 ద్విచక్ర వాహనాలు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.

தொடர்புடைய செய்தி