ఆదిలాబాద్ జిల్లా గంగపుత్ర సంఘం అధ్యక్షుడు బొంపెల్లి భూమన్న (59) గుండెపోటుతో మృతి చెందారు. ఆదిలాబాద్ లోకి వికలాంగుల కాలనీలో నివాసముంటున్న భూమన్న బుధవారం సాయంత్రం గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కాగా భూమన్న ఆకస్మిక మరణంతో గంగపుత్ర సంఘం నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల బాధిత కుటుంబానికి పలువురు సంతాపం తెలిపారు.