మైదుకూరు: రాయలసీమ హక్కుల కోసం ఐక్యంగా ఉద్భవించండి
రాయలసీమ వెనుకబాటు తనానికి, అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం ఇప్పటివరకు రాయలసీమ జిల్లాల నుంచి అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నికైన ప్రజాప్రతినిధులే కారణమని రైతు సేవా సమితి అధ్యక్షుడు రమణ అన్నారు. శనివారం మైదుకూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాయలసీమ హక్కుల దినోత్సవం సందర్భంగా రమణ మాట్లాడుతూ రాయలసీమలో పరిశ్రమలు, సాగునీటి అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ రాజకీయాలకతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు.