ఉండి: చోరీ ఘటనపై కేసు నమోదు
ఉండి మండలం పాందువ్వ గ్రామంలో చోరీ ఘటనపై మంగళవారం పోలీసుల కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన అల్లూరి రవికుమార్ ఈనెల 15న ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. 18న ఉదయం తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపల బీరువాలోని రూ. 50వేల నగదు, రూ. 95వేల విలువైన 18వెండి నాణాలు, గిన్నె, విగ్రహం, ఇతర ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.