సూర్యరావుపాలెం ఘటనపై మాజీ మంత్రి దిగ్భ్రాంతి

64பார்த்தது
సూర్యరావుపాలెం ఘటనపై మాజీ మంత్రి దిగ్భ్రాంతి
ఉండ్రాజవరం మండలం సూర్యారావు పాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పిడుగు పడి జరిగిన భారీ విస్ఫోటనం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడే మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி