తాడేపల్లి: సీఎం చంద్రబాబు ఎప్పటికీ మారారు: మాజీ సీఎం జగన్
రాష్ట్ర అప్పులపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తుందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. తాడేపల్లిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో, సీఎం చంద్రబాబు ఎప్పటికీ మారరు అని విమర్శించారు. 2018-19 నాటికి అప్పు 3 లక్షల కోట్లు కాగా, 2024 నాటికి 6.46 లక్షల కోట్లు చేరుకున్నట్లు తెలిపారు. 12 నుంచి 14 లక్షల కోట్లు అని చేసిన అబద్ధాలు ధర్మమేనా? అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.