ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి

380பார்த்தது
ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి
తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ వార్షిక సమావేశం శనివారం ఆంజనేయ స్వామి గుడి వద్ద జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షుడు రుద్ర శ్రీను మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను దగా చేస్తుందని, సంక్షేమ పథకాలు ఆపేస్తుందని వాటిని పునరుద్ధరణ చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన
చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు సునీల్, కోశాధికారి బండి సర్వేశ్వరరావు, మద్దుకూరి నాగు, కోయి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you