మొగల్తూరు: సముద్రంలో వేటకు వెళ్లొద్దు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ప్రభుత్వం మత్స్యకారులకు హెచ్చరికలు జారీచేసింది. ఈ నెల 23 నుంచి నాలుగు రోజుల పాటు సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఉండనున్న నేపథ్యంలో మొగల్తూరు మండలంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలని, ఇప్పటికే వేటకు వెళ్లిన వారిని వెనక్కి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో దాసురాజు సంబంధిత అధికారులకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.