ఏలూరు: భక్తులతో పోటెత్తిన శైవక్షేత్రం
ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో చిన్న వెంకన్న క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతున్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి ఆలయం కార్తీక మూడవ సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. శివనామస్మరణలతో ఆలయం మారుమోగింది. వేకువజాము నుంచే భక్తులు స్వామివారి అభిషేకం చేయించుకునేందుకు బారులు తీరారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.