ఇటువంటి సంఘటన దురదృష్టకరం: కలెక్టర్
ఉండ్రాజవరం మండలం సూర్యరావుపాలెం గ్రామంలో బుధవారం పిడుగుపాటుకు బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల పశ్చిమగోదావరి జిల్లా జిల్లా కలెక్టర్ నాగరాణి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భీమవరంలో ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పండుగ సమయంలో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.