ఫిషింగ్ హార్బర్లో మునిగిపోయిన ట్రాలర్లు, బోట్లు తొలగింపు
విశాఖ పోర్టు అథారిటీ ఫిషింగ్ హార్బర్లో వివిధ జెట్టీల వద్ద మునిగిపోయిన ఫిషింగ్ ట్రాలర్లు, బోట్ల శిథిలలను తొలగించే ప్రక్రియకు బుధవారం శ్రీకారం చుట్టింది. ఫిషింగ్ హార్బర్ జట్టీలలో కొన్నేళ్లుగా పదుల సంఖ్యలో బోట్లు, ట్రాలర్లు మునిగిపోయి శిథిలావస్థలో ఉన్నాయి. స్థానిక మత్స్యకారుల సహాయంతో 6 ఫిషింగ్ ట్రాలర్లు, 11 బోట్లు సముద్రం అడుగున మునిగిపోయినట్లు గుర్తించి వాటిని తొలగించారు.