నర్సీపట్నం: ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
నర్సీపట్నం మండలం గురందరపాలెం గ్రామంలో ప్రసాద్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి లో ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న అతను బుధవారం రాత్రి అత్తగారింటికి వచ్చాడు. ఉదయం లేచి చూసేసరికి పొలంలో ఉరి వేసుకొని కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.