అరకు సిగాలో మరో అద్భుతం
ఆంధ్ర ఊటీ అరకులోయలో మరో మేఘాల కొండ కనువిందు చేస్తుంది. అరకు లోయ మండలం లంతంపాడు సమీపంలోని ఎత్తైన కొండపై నుంచి చూస్తే పాలసముద్రంలాంటి పొగ మంచులు ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసే ఈ అందాల రమణీయతను పర్యటకశాఖ ఐటిడిఏ అభివృద్ధి చేస్తే, పర్యాటకులకు కొత్త అనుభూతులు అందించగలదు. ఈ అభివృద్ధి స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.