జీలుగుపుట్టులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
టీడీపీ అరకు నియోజకవర్గ ఇంచార్జి సివేరి దొన్నుదొర ఆదేశాల మేరకు గురువారం హుకుంపేట మండలం గత్తుమ్ పంచాయతీ పరిధి జీలుగుపుట్టు గ్రామంలో బూత్ ఇంచార్జి గురుమూర్తి ఆనందరావు, టీడీపీ నేతలు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ సభ్యత్వం 2 సంవత్సరాలకు గాను కేవలం రూ. 100 చెల్లిస్తే రూ. 5 లక్షలు ప్రమాద బీమా వస్తుందన్నారు. అలాగే మట్టి ఖర్చులు కింద రూ. 10 వేలు వస్తాయని ఆనందరావు తెలిపారు.