అరకు: రోడ్డు కోసం ధర్నా చేస్తున్న గిరిజనులు
అల్లూరి సీతరామరాజు జిల్లాలోని అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధి గ్రామాలైన చిందుగులపాడు తట్టపూడి దాయర్తి గ్రామాల గిరిజన ప్రజలు గురువారం విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద డోలిమోత ద్వారా నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామ రోడ్డు సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. గతంలో అనేక మార్లు తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.