పెందుర్తి: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెందుర్తిలో చోటుచేసుకుంది. గాంధీనగర్ ప్రాంతానికి చెందిన భాను ప్రకాశ్ (20) ఆదివారం వారి ఇంట్లో ఫ్యానుకు ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూసే సరికి భాను ప్రకాశ్ మృతి చెందాడు.