జిల్లా ఉప విద్యాశాఖధికారి పాఠశాల ఆకస్మిక తనిఖీ
బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మవరం అగ్రహారానికి డిప్యూటీ ఈ ఓ పి. అప్పారావు ఆకస్మికంగా సందర్శించారు. ఆయన ఉపాధ్యాయుల హాజరు, 10వ తరగతి విద్యార్థుల నోట్స్ బుక్స్ ను పరిశీలించి, దసరా సెలవుల్లో అందరూ ఇంటి వద్ద చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లలితాంబ, కృష్ణవేణి, ఆర్. అప్పలనాయుడు, గారా ప్రకాష్ పాల్గొన్నారు.