సాలూరు: సమస్యల పరిష్కారం కోసం ఆశాల వినతి
ఆశా కార్యకర్తలు తమ సమస్యల సాధన కోసం సాలూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద నిరసన తెలియజేస్తూ ఆయా పీహెచ్సిల వైద్యాధికారులకు వినతి పత్రాలను అందజేసారు. ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరచి, ఆదుకోవాలంటూ సిహెచ్డబ్ల్యుఓలతో కలిసి బుధవారం మండలంలోని మామిడిపల్లి, తోణాం, బాగువలస పిహెచ్సిల వైద్యాధికారులు శివ కుమార్, సుజాత తదితరులకు వినతి పత్రాలను సమర్పించారు.