Nov 05, 2024, 07:11 IST/
ప్రైవేటు ఆస్తుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Nov 05, 2024, 07:11 IST
ప్రైవేటు ఆస్తుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ప్రతి ప్రైవేటు ఆస్తి ప్రజా వనరుల కిందకు రాదని తేల్చి చెప్పింది. ప్రైవేటు ఆస్తులు ప్రజా వనరుల కిందకే వస్తాయని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజలకు మేలు చేయొచ్చని 1978లో జస్టిస్ కృష్ణ అయ్యర్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు చెల్లదని వివరించింది. 1960 నాటి సోషలిస్ట్ ఎకానమీ 1990ల్లో మార్కెట్ ఆధారిత ఎకానమీగా మారిందని పేర్కొంది. ఈమేరకు 8:1 మెజారిటీతో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.