కురుపాం: బడ్జెట్లో అన్ని వర్గాలు, అన్ని రంగాలకు న్యాయం
కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని అన్ని వర్గాలు, అన్ని రంగాలకు న్యాయం జరిగే విధంగా నిధులు కేటాయించిందని కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. కూటమి ప్రభుత్వం సోమవారం అసెంబీల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తోటపల్లి సాగునీటి ప్రాజెక్టుకు, ఎన్టీఆర్ జలసిరికి, వైఎస్సార్ ఉద్యాన కళాశాలకు నిధుల కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు.