కురుపాం: పక్కా ప్రణాళికతో ఆరోగ్య కార్యక్రమాలు
ప్రగతి నివేదికలు పురోగతి చెందేలా పక్కా ప్రణాళికతో ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మన్యం జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్మోహనరావు సూచించారు. ఈ మేరకు గరుగుబిల్లి పిహెచ్సి సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు నమోదు, ఆరోగ్య వివరాల రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన పలు ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ తీరు ఏ మేరకు ఉందో సంబంధిత ప్రగతి నివేదికలను పరిశీలించారు.