పార్వతీపురం: జూనియర్ విద్యార్థులకు భోజన పథకం అమలు చేయాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకాన్ని అమలు చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా. లోకేష్ గతంలో మువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని శనివారం ఏఐఎస్ఎఫ్ మన్యం జిల్లా కార్యదర్శి బి. రవి కుమార్ డిమాండ్ చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు పూర్తి అయిందని, ఇంకా ఆలస్యం చేస్తే డ్రాపోర్ట్స్ పెరిగే ప్రమాదం ఉందని అన్నారు.